- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు రెండు లక్షల కోట్లు ఆదా : జీఎస్టీ సవరణలపై కేంద్ర మంత్రి సీతారామన్
అత్యధిక రెవెన్యూ అందించే 12 శాతంలోని 99 శాతం వస్తువులన్నీ 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యధిక రెవెన్యూ అందించే 12 శాతంలోని 99 శాతం వస్తువులన్నీ 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఇది మధ్య తరగతి, పేదలకు చాలా ఉపయోగపడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విశాఖపట్నంలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీ రేట్లను తగ్గిచడం ద్వారా దేశ ప్రజలకు రెండు లక్షల కోట్ల మేర డబ్బు మిగులుతుందన్నారు. దేశంలో వివిధ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహక ప్రయోజనాలు కన్నా పది రెట్ల ప్రయోజనాలు ఈ సంస్కరణలతో ప్రజలకు అందుతాయన్నారు. 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారు. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2025లో రూ.22.08 లక్షల కోట్లు వచ్చింది. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనుండటంతో సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యే నవరాత్రి ఉత్సవాలను దేశ ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటారన్నారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలుస్తున్న యూపీఏ ప్రభుత్వం ఆనాడే ఎందుకు ఈ ట్యాక్స్ ను అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు.






