AP News:‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోం’.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-30 14:00:15  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Industry)ను ప్రైవేటీకరణ(Privatization) చేయబోమని, ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి(Union Steel Minister) కుమారస్వామి(Kumaraswamy) వెల్లడించారు.

AP News:‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోం’.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Industry)ను ప్రైవేటీకరణ(Privatization) చేయబోమని, ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి(Union Steel Minister) కుమారస్వామి(Kumaraswamy) వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా కేంద్ర మంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్లాంటును పునర్‌నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.35 వేల కోట్ల అప్పు ఉందని మంత్రి తెలిపారు.

తాను కేంద్ర మంత్రి అయ్యాక విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్నో సమీక్షలు చేశామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదని.. 2013-14 వరకు కూడా పరిశ్రమ పనితీరు బాగానే ఉందన్నారు. అయితే ఎప్పటి నుంచైతే ఉక్కు ఉత్పత్తులు పెంచాలని నిర్ణయించారో అప్పటి నుంచి నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమ(Visakha Steel Industry)లో పెట్టుబడులు ఉపసంహరణ ప్రతిపాదించారు.

ఈ క్రమంలో 2030 లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండో స్థానంలో భారతదేశం(India) ఉందని పేర్కొన్నారు. 2013-14 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరు బాగా ఉందన్నారు. 2013లో విశాఖ ఉక్కు పరిశ్రమ(Visakha Steel Industry) నవరత్న హోదా సాధించిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఈ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు.

Next Story