- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajyasbha: గోదావరి జలాలు కాలుష్యరహితం
by Vemula.Srinu Prasad |
గోదావరి నదీ జలాల్లో కాలుష్యం లేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు...

X
దిశ, ఏపీ బ్యూరో: గోదావరి నదీ జలాల్లో కాలుష్యం లేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దేశంలోని కలుషిత నదీ భాగాలను గుర్తిస్తూ 2018 సెప్టెంబర్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారం రాయనపేట నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదీ జలాలు కలుషితం అయినట్లు గుర్తించినప్పటికీ నవంబర్ 2022 సీపీసీబి నివేదికలో ఆ జాబితా నుంచి గోదావరిని తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి జలాల్లో కాలుష్య నిర్మూలన, నదీ జలాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ పథకం కింద 110.22 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు
Next Story






