ప్రధాని పిలుపుతో తెలుగు కేంద్రమంత్రి పొదుపు చర్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-16 17:29:28  IST  )

ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధికారిక కాన్వాయ్‌ను వదిలి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ..

ప్రధాని పిలుపుతో తెలుగు కేంద్రమంత్రి పొదుపు చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ(Union Minister Bhupathi Raju Srinivasa Varma) అధికారిక కాన్వాయ్‌ను వదిలి ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం ఆదా చేసే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్.. భారతదేశానికి ఆదా చేసిన విదేశీ మారక ద్రవ్యమని తెలిపారు. మెట్రోలో ప్రయాణించే ప్రతి కిలోమీటర్ మన ఆర్థిక వ్యవస్థకు బలం, మన పర్యావరణానికి రక్షణ అని పేర్కొన్నారు. ఈ జాతీయ సంకల్పంలో భాగస్వాములు కావాలని ప్రతి భారతీయుడికి పిలుపునిచ్చారు. ‘మెట్రో ఎక్కండి. బస్సు ఉపయోగించండి. పొరుగువారితో కార్‌పూల్ చేయండి. వీలైనప్పుడు ఇంటి నుంచే పని చేయండి. 140 కోట్ల భారతీయుల చిన్న అడుగులే మోడీజీ కలలుగన్న ఆత్మనిర్భర భారత్‌కు పెద్ద పునాది అవుతుంది.’’ అని భూపతి రాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.

శ్రీనివాసవర్మ ట్వీట్..

Next Story