మలయాళం సినిమా పేరులా ఉంది: జగన్ మావిగన్‌పై కేంద్రమంత్రి సెటైర్లు

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధానిగా ‘మావిగన్‌’ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విషయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది...

మలయాళం సినిమా పేరులా ఉంది: జగన్ మావిగన్‌పై కేంద్రమంత్రి సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా ‘మావిగన్‌’(MAVIGUN) ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి నేతలు మూకుమ్మడిగా జగన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంలో వైసీపీ(Ycp)-టీడీపీ, జనసేన, బీజేపీ(Tdp,Janasena, Bjp) నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. అయితే జగన్ తీసుకున్న మావిగన్ నిర్ణయంపై తాజాగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Union Minister Bhupatiraju Srinivasa Varma) సైతం విమర్శలు చేశారు. మలయాళం సినిమా పేరులా ‘‘మావిగన్’’ ఉందని కేంద్రమంత్రి ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ను మావిగన్ సలహా ఎవరిచ్చారోనని ఆయన సెటైర్లు వేశారు. జగన్ ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతి(Amaravati)నే ఏపీకి ఏకైక రాజధాని అని భూపతి రాజు తేల్చి చెప్పారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని తెలిపారు. ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.

Next Story