సినీ గ్లామర్‌కు మించిన స్టార్ ప్రధాని మోడీ: భూపతిరాజు శ్రీనివాస వర్మ

by Vemula.Srinu Prasad |

సినీ గ్లామర్‌కు మించిన స్టార్ ప్రధాని మోడీ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు...

సినీ గ్లామర్‌కు మించిన స్టార్ ప్రధాని మోడీ:  భూపతిరాజు శ్రీనివాస వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: సినీ గ్లామర్‌కు మించిన స్టార్ ప్రధాని మోడీ అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన ఏపీలో సినీ గ్లామర్‌పై స్పందించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో సినీ గ్లామర్ వర్కౌట్ కావడంలేదని చెప్పారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బలమైన నాయకుడని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్లే కూటమి విజయం సాధించిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు మళ్లీ మోదీ పాలననే కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, కచ్చితంగా విజయం సాధిస్తామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దీమా వ్యక్తం చేశారు.

Next Story