- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి భారీగా నిధులు మంజూరు... కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సక్రమంగానే ఏపీ(Ap)కి నిధులు విడుదల అవుతున్నాయి. విభజనతో ఆర్థికంగా లోటులో ఉన్న ఏపీని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటోంది. మిత్రపక్షంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది. ప్రధాని మోడీ(Cm Modi) సైతం సహకరిస్తున్నారు. రాష్ట్రం నుంచి విజ్ఞప్తి ప్రతీసారి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. దీంతో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివర్మ(Union Minister Bhupathi Raju Srinivarma) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన వైసీపీ(Ycp) హయాంలో నిధులు భారీగా దోపీడీ అయ్యాయన్నారు. ప్రతి పనిలోనూ కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. నిధులు దుర్వినియోగమయ్యేలా ప్రభుత్వ పథకాలు రూపకల్పన చేశారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి భూపతి రాజు స్పష్టం చేశారు.






