- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అభివృద్ధిపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు
2014-15లోనే అమరావతికి ప్రధాని మోడీ రూ. 2500 కోట్ల రూపాయలు ప్రకటించారని, రైల్వే లైన్లు కనెక్టివిటీ కోసం నిధులు కేటాయించారని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: 2014-15లోనే అమరావతి(Amaravati)కి ప్రధాని మోడీ రూ. 2500 కోట్ల రూపాయలు ప్రకటించారని, రైల్వే లైన్లు కనెక్టివిటీ కోసం నిధులు కేటాయించారని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ(Bhoopati Raju Srinivasa Varma) స్పష్టం చేశారు. కేవలం కేంద్రంతోనే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్ల కేటాయించడంతో పాటు రాష్ట్రంలో చాలా పరిశ్రమలకి తొడ్పాటు కలిపిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ప్రధాని మోడీ(Pm Modi) ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. కేంద్రానికి ఏపీ(Ap) పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదని గత ప్రభుత్వంలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ వేల కోట్ల రూపాయలు నిధులు కేంద్రం మంజూరు చేసి రాష్ట్ర ప్రజల సెంటిమెంటును కేంద్రం గౌరవిస్తోందన్నారు. జూన్ 21న యోగాంధ్ర డేలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.






