నా గుండె ఉప్పొంగిపోతోంది: వైజాగ్ అందాలపై బండి సంజయ్ ఫిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-20 10:07:04  IST  )

వైజాగ్ ఎప్పుడు వచ్చినా తన గుండె ఉప్పొంగిపోతోందని, ఏదో తెలియని అనుభూతి అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు...

నా గుండె ఉప్పొంగిపోతోంది: వైజాగ్ అందాలపై బండి సంజయ్ ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్(Vyzag) ఎప్పుడు వచ్చినా తన గుండె ఉప్పొంగిపోతోందని, ఏదో తెలియని అనుభూతి అని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్(Visakhapatnam Park Hotel Circle) వద్ద వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖ ప్రజలపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. ఈ నేల కేవలం అందానికి మాత్రమే కాదని, పోరాటాలకు కూడా ప్రసిద్ధి అని తెలిపారు. స్వాతంత్య ఉద్యమాల నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకూ ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేమన్నారు. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారని, కష్టాల కడలి తుఫాన్లు చూశారని, నష్టాలు చూశారని, అవకాశాలు ఆలస్యమైనా ఎదురు చూశారని, అయినా ఇక్కడి ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాదని, నమ్మకంతో జీవిస్తారని తెలిపారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని బండి సంజయ్ తెలిపారు.

‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. విశాఖపట్నం సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

READ MORE ....

మాకు ఏపీనే స్ఫూర్తి: విశాఖ పర్యటనలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Next Story