- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డొక్కు స్కూటర్‌పై దేశమంతా తిరిగి...!
విలువలతో రాజకీయాలు చేయవచ్చని చూపించిన మహా నేత వాజ్ పేయి అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు...

దిశ, వెబ్ డెస్క్: విలువలతో రాజకీయాలు చేయవచ్చని చూపించిన మహా నేత వాజ్ పేయి అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్(Visakhapatnam Park Hotel Circle) వద్ద వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన దేశం వెలకట్టలేని అమూల్యమైన ‘భారత రత్నం’ వాజ్ పేయి అని చెప్పారు.
‘‘పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు. పదవికే గౌరవం నేర్పిన వ్యక్తి వాజ్ పేయి. రాజకీయాల్లో గొప్పతనమంటే ఎన్నిసార్లు గెలిచామన్నది కాదని, ఎంత మంది హృదయాలు గెలిచామన్నదే ముఖ్యమని నిరూపించిన మహానేత వాజ్ పేయి. డొక్కు స్కూటర్ పై దేశమంతా తిరిగి బీజేపీని విస్తరించేలా చేసిన ఘనత వాజ్ పేయిదే. ప్రత్యర్ధి పార్టీలు సైతం తలవంచి గౌరవించే మహోన్నతుడు వాజ్ పేయి. ఓడినా దేశ ప్రజల హ్రుదయాలను గెలిచిన మహా నేత. వాజ్ పేయి ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు మోడీ. దేశాన్ని ఆర్ధిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిన నేత మోడీ. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర భేష్. ప్రతి జిల్లాలో అటల్ జీ విగ్రహాలను ఏర్పాటు చేయడం గ్రేట్.’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.






