- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై బాలికకు ఊహించని ప్రమాదం.. తలపై ఊడిపడిన శ్లాబ్ పెచ్చులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కుటుంబం ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో మెట్ల పూజ నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri)పై కనకదుర్గమ్మ అమ్మవారి(Kanakadurgamma Ammavaru) దర్శనానికి వచ్చిన భక్తుల కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కుటుంబం ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో మెట్ల పూజ నిర్వహించారు. ఈ సమయంలో పైనున్న శ్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. దీంతో పూజలో కూర్చున్న తొమ్మిదేళ్ల బాలిక తలపై ఆ శ్లాబ్ ముక్కలు పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావమవుతున్న బాలికను ఆసుపత్రికి తరలించారు.
ఇంత జరిగినా..
అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ పరిధిలో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అత్యవసర వైద్య సేవలు అందించడంలో సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపించడంతో స్థానికంగా ఉన్న భక్తులు, బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దుర్గగుడిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భద్రతను గాలికొదిలేసి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆలయ ఈఓ, సిబ్బందిపై భక్తులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన కట్టడాల మరమ్మతులు చేపట్టాలని, భక్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






