ఏపీలో UG, PG ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

by Muthe.Rajitha |

ఏపీ ఉన్నత విద్యామండలి 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏపీలో UG, PG ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఉన్నత విద్యామండలి 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏపీఈసెట్‌ ఏప్రిల్‌ 4న, ఏపీ ఐసెట్‌ ఏప్రిల్‌ 28న, ఏపీ పీజీఈసెట్‌ ఏప్రిల్‌ 29, 30 మరియు మే 2న, లాసెట్‌ మే 4న, ఎడ్‌సెట్‌ మే 4న, పీజీసెట్‌ మే 5, 8, 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షలు మే 12, 13, 14, 15 మరియు 18న, ఎప్‌సెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్లను గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

Next Story