- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఎస్పీని కలుస్తానంటూ షాకింగ్ కామెంట్స్
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. వెంగమాంబ అనే మహిళ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. వెంగమాంబ అనే మహిళ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లోకి రమ్మని, వెంట తిప్పుకుని, జీతం లేకుండా పనిచేయించుకుని.. ఉమెన్ అడ్వైజర్ గా పదవి ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశారంటూ సదరు మహిళ ఆరోపణలు చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టి సారించాలని కోరింది.
తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించారు. వెంగమాంబ అనే మహిళ తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తమని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఇది వైసీపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు. వెంగమాంబతో కొందరు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. 2029లో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని తాను చెప్పలేదన్నారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతానన్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలేంటో బయటికొస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






