- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ థార్ కార్ల వార్ కేసు: జైలుకు ఇద్దరు యువకులు
విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో థార్ జీపు(Thar Jeeps)లతో ఇద్దరు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితులను జిల్లా జైలుకు తరలించారు. వంద అడుగుల రోడ్డులో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరు చేసిన ప్రమాదకర స్టంట్ల వెనుక డ్రగ్స్ మత్తు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
వెలుగులోకి సంచలన విషయాలు
కాగా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు బొల్లా ఓంకార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ సేవించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. మత్తు వల్లే నిందితుడు రోడ్డుపై కార్ల ఛేజింగ్‌లకు పాల్పడ్డాడని, ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రవర్తించాడని పోలీసులు ధృవీకరించారు.
యువతి కోసం జరిగిన పంతాల వల్లే హైడ్రామా
ఈ హైడ్రామా అంతా ఒక యువతి కోసం జరిగిన పంతాల వల్లేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు గొడవకు దిగి, ఒకరి జీపును ఒకరు ఢీకొట్టుకుంటూ రోడ్డుపై కల్లోలం సృష్టించారు. గొడవ జరుగుతున్న సమయంలో సదరు యువతి కూడా అక్కడే ఉన్న కారులో కూర్చుని ఉన్నట్లు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టంగా తెలిసింది.
ఆ మిస్టరీ యువతి ఎవరు..?
ప్రస్తుతం ఈ ఉత్కంఠకు కారణమైన ఆ మిస్టరీ యువతి ఎవరనే కోణంలో విజయవాడ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆమెను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి.. ఈ గొడవతో సంబంధం ఉన్న మిగిలిన వారు ఎవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.






