- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalleru: నదిలో స్నానానికి ఇద్దరు యువకులు గల్లంతు.. గాలింపు
సీలేరు నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీలేరు నది(Seeleru river)లో ఇద్దరు యువకులు(Two Youths) గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు వెళ్లిన శ్రీను, దిలీప్ కొద్దిసేపటికే నీటి కొట్టుకుపోయారు. దీంతో వారిద్దరి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో యువకులు శ్రీను, దిలీప్ స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే బాధిత కుటుంబాలకు సమాచారం అందజేశారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






