- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం పుణ్యక్షేత్రంపై డ్రోన్.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంపై ఇద్దరు యువకులు డ్రోన్ ఎగరవేశారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisalam)పై ఇద్దరు యువకులు డ్రోన్(Drone) ఎగరవేశారు. పరిసరాలను చిత్రీకరించారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయాలపై డ్రోన్ ఆపరేట్ నిషేధం ఉన్నా ఇద్దరు యువకులు అత్యుత్సాహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి డ్రోన్ ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకుని ఫొటోలు, వీడియోలను పరిశీలించారు. ఆలయ గోపురాలు, దేవస్థానం పరిసరాలు, భక్తుల తాకిడి దృశ్యాలను డిలేట్ చేశారు. సరదాగా చేశారా..? లేదా మరేదైనా ఉందా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం క్షేత్రంలో డ్రోన్ వినియోగం వల్ల భక్తుల భద్రతకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఎవరు డ్రోన్ వినియోగించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






