Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ... ఇద్దరు స్పాట్‌డెడ్

by Vemula.Srinu Prasad |

బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు..

Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ... ఇద్దరు స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: బైక్‌(Byke)ను లారీ(Lorry) ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా(Krishna District) మోపిదేవి టోల్ గేట్(Mopidevi Toll Gate) వద్ద జరిగింది. అవనిగడ్డ(Avanigadda)కు చెందిన బంతుల సుధాకర్, యు. బాల బాస్కర్ బైక్ వస్తుండగా వెనుక నుంచి లారీ అతివేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. లారీ అతివేగమే ప్రమాదానికి గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story