- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గమ్మ వారధిపై ఘోరం.. ఇద్దరు స్పాట్‌డెడ్
అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొద్దిసేపు మృతువుతో పోరాటం చేసి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన విజయవాడ దుర్గమ్మ వారిధిపై జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొద్దిసేపు మృతువుతో పోరాటం చేసి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన విజయవాడ దుర్గమ్మ వారిధి(Vijayawada Durgamma Varidhi)పై జరిగింది. బైక్‌పై ఇద్దరు యువకులు గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్నారు. అయితే వీరు దుర్గమ్మ వారిధిపైకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. బలంగా దెబ్బలుతగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు యువకుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. స్థానిక సీసీ పుటేజుల ఆధారంగా యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నం చేశారు.






