పవన్ కల్యాణ్ సభలో చాకుల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు..!

by Satheesh |   (  Updated:2024-04-22 04:35:54  IST  )

ఎన్నికల వేళ రాజకీయ నేతలపై దాడులు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర

పవన్ కల్యాణ్ సభలో చాకుల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాజకీయ నేతలపై దాడులు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న సీఎం జగన్‌పై విజయవాడలో దుండగులు రాళ్ల దాడి చేయగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గాజువాకలో రాళ్ల దాడికి యత్నించిన చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలు స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతుండగానే.. ఇవాళ మరో ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. పవన్ సభలో అనుమానస్పదంగా తిరుగుతోన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద తనిఖీ చేయగా జేబులో చాకులు దొరికాయి. దీంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసున్నట్లు సమాచారం. నిందితులను భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ సభకు యువకులు ఏకంగా చాకులు పట్టుకుని రావడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story