ఏపీలో రెండేళ్ల పాలన విజయోత్సవం.. పార్టీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు!

by Malleboina Mahesh |

ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి. జూన్ 15 నుండి ఆగస్టు చివరి వరకు ఈ-సైకిళ్లపై 'ఇంటింటి ప్రచారం' చేపట్టాలని సీఎం చంద్రబాబు పిలుపు.

ఏపీలో రెండేళ్ల పాలన విజయోత్సవం.. పార్టీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాలన విజయోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు, ప్రభుత్వ యంత్రాంగానికి కీలక పిలుపునిచ్చారు. ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వీలుగా భారీ ఎత్తున 'ఇంటింటి ప్రచారం' ('Door-to-door campaign') కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.

ఈ మహా ప్రజా సంపర్క ప్రచార కార్యక్రమం జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభమై, ఆగస్టు నెలాఖరు వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో వినూత్నంగా ఈ-సైకిళ్లను (E-Bicycles) ఉపయోగించాలని, ప్రజాప్రతినిధులు, నాయకులు సైకిళ్లపైనే ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఈ ప్రచారంలో ప్రజలను నేరుగా కలుసుకునేందుకు తాను కూడా స్వయంగా పాల్గొంటానని, తాను సైతం సైకిల్‌పైనే ప్రచారం చేస్తానని చంద్రబాబు ప్రకటించడంతో కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Next Story