- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గేదెను తప్పించబోయి కారు బోల్తా.. ఇద్దరు మహిళల దుర్మరణం
నెల్లూరు జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం వాశీలి సమీపంలో గేదెను తప్పించబోయిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం వాశీలి సమీపంలో గేదెను తప్పించబోయిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నెల్లూరుకు చెందిన భాగ్యమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు.
అలాగే ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరంతా మైదుకూరులో నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పాల్గొని నెల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో, గ్రామంలో విషాదాన్ని నింపింది.






