- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం
రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే జరిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజానగరం మండలం దివాన్ చెరువు(Diwan Chervu)లో జరిగింది. పాలచర్ల నర్సరీ(Palcherla Nursery)లో రోజూ మాదిరి ఇద్దరు మహిళలు పని చేసి సాయంత్రం తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. దివాన్ చెరువు వద్దకు వెళ్లగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. మృతుల వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.






