కొంపముంచిన గూగుల్ మ్యాప్.. పండుగపూట ఇద్దరు మహిళలు మృతి

by Gantepaka Srikanth |

పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి కారును వెనుక వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కొంపముంచిన గూగుల్ మ్యాప్.. పండుగపూట ఇద్దరు మహిళలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ(Kakinada) జిల్లా సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి కారును వెనుక వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. వీరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ ప్రదీప్ మాట్లాడుతూ.. గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్ చూపించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడంతో ప్రమాదం జరిగిందని అని వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నం అక్షయ్యపాలెంకు చెందిన కొల్లి అనుదీప్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన మేనత్త మరణించగా, కుటుంబాన్ని పరామర్శించేందుకు తన తల్లి వెంకటపద్మావతి (59), పిన్ని ల్లి దీప్తి (45)తో కలిసి అనుదీప్ కారులో కాకినాడ వచ్చారు. పరామర్శ ముగించుకుని తిరిగి విశాఖ వెళ్తుండగా, ప్రమాదం జరిగింది. అనుదీప్ కళ్లముందే తల్లి, పిన్ని మరణించడంతో ఆయన బోరున విలపించడం చూసి స్థానికులు కన్నీరు పెట్టారు.

Next Story