- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు మహిళల చేతివాటం.. బస్సు ఎక్కుతున్నట్టే నటించి భారీ చోరీ
విశాఖ ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న మహిళా ప్రయాణికురాలిని ఇద్దరు దొంగలు బురిడీ కొట్టించారు. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్(Visakhapatnam Dwaraka RTC Complex)లో భారీ చోరీ(Major Theft) తీవ్ర కలకలం రేపింది. కాకినాడ(Kakinada) వెళ్లేందుకు బస్సు(Bus) ఎక్కుతున్న మహిళా ప్రయాణికురాలిని ఇద్దరు దొంగలు బురిడీ కొట్టించారు. రద్దీని ఆసరాగా చేసుకుని, తాము కూడా బస్సు ఎక్కుతున్నట్లు నటిస్తూ ఆమె వద్ద ఉన్న బ్యాగు నుంచి ఏకంగా 35 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. నిమిషాల వ్యవధిలోనే చేతివాటం ప్రదర్శించి నగల మూటతో అక్కడి నుంచి పరారయ్యారు.
సిసిటివి కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్
అయితే బాధితురాలు తన నగలు పోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని నిఘా నేత్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు ప్రయాణికురాలిని చుట్టుముట్టి బ్యాగులోంచి బంగారం కాజేస్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరు కిలాడీ మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులు తమ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.






