సీటు కోసం గొడవ.. ఆర్టీసీ బస్‌లో వృద్ధురాలిపై దాడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-28 10:48:34  IST  )

సీట్ కోసం ఆర్టీసీ బస్‌లో వృద్ధురాలిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు..

సీటు కోసం గొడవ.. ఆర్టీసీ బస్‌లో వృద్ధురాలిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ బస్సు పథకం(Free Bus Scheme) కొందరు మహిళల్లో గొడవలకు దారి తీస్తోంది. ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే సీటు కోసం కొందరు మహిళలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. కొన్ని సమయాల్లో కొట్లాటవరకు వెళ్తున్నారు. వృద్ధులని కూడా చూడకుండా పిడుగుద్దులు కురిపిస్తున్నారు. తాజాగా జరిగిన గొడవలో వృద్ధురాలు రోడ్డెక్కారు. అనంతపురం జిల్లా కదిరిలో వృద్ధురాలితో పాటు ప్రయాణికులు బస్సు ఎక్కారు. అయితే సీటు కోసం ఆమెతో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. బూతులు తిడుతూ వృద్ధురాలిపై దాడి చేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఏడుస్తూ బస్సు ముందు బైఠాయించింది. వృద్ధురాలైన తనకు సీటు ఇవ్వమన్నందుకు తనపై కొందరు మహిళలు దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story