తిరుమలలో వరుస ప్రమాదాలు.. ఉలిక్కిపడ్డ భక్తులు

by Vemula.Srinu Prasad |

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు...

తిరుమలలో వరుస ప్రమాదాలు.. ఉలిక్కిపడ్డ భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డు(Tirumala Ghat Road)లో శనివారం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమిళనాడు(Tamilnadu)కు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ జీపు కూడా అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో మార్గమధ్యలో కాసేపు కలకలం రేగింది. ఈ రెండు ప్రమాదాల్లో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాల్లో...

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వరుస ప్రమాదాల వల్ల మొదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story