Big alert: రెండు బస్సులు ఢీ.. శ్రీశైలం వైపు 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద నల్లమల్ల ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి...

Big alert:  రెండు బస్సులు ఢీ.. శ్రీశైలం వైపు  10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా దోర్నాల(Dornala) వద్ద నల్లమల్ల ఘాట్ రోడ్డు(Nallamalla Ghat Road)లో రెండు ఆర్టీసీ బస్సులు(Rtc Busses) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ బస్సు డ్రైవర్ కేబిన్‌లో చిక్కుకుపోయారు. అతి కష్టం మీద ఆయన్ను బయటకు తీశారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో రెండు బస్సులను పక్కకు తీశారు. అయితే శ్రీశైలం వైపు 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనతో దోర్నాల వైపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Next Story