- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Family : మంచు ఫ్యామిలీపై చంద్రగిరిలో రెండు పోలీస్ కేసులు
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కుటుంబంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో వరుస పోలీసు కేసులు నమోదవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కుటుంబంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో వరుస పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపైన కేసు నమోదుకాగా, మంచు మనోజ్(Manchu Manoj)పై కూడా ఇక్కడ కేసు నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి యూనివర్సిటీ వద్ధ తాజాగా జరిగిన గొడవల నేపధ్యంలో చంద్రగిరి(Chandragiri) పోలీస్ స్టేషన్ లో మంచు కుటుంబ సభ్యులు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుల మేరకు పోలీసులు వారిపై రెండు కేసు(Two Police Cases)లు నమోదు చేశారు.
యూనివర్సిటీ, డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులు చేసుకున్నాయి. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక, మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. అలాగే నాపై, నా భార్యపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు.
మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏ-1. మనోజ్, ఎ-2, మౌనిక, ఎ-3 రెడ్డి, ఏ-4 పళని రాయల్, ఎ-5.పవన్ లను పేర్కొన్నారు.
మనోజ్ ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏ-1 విజయ్ సింహా, ఏ-2. సురేంద్ర, ఏ-3 బాలాజీ, ఏ-4.సారధి, ఏ-5 కిరణ్, ఏ-6 రవి శేఖర్, ఏ -7. హేమాద్రి, ఏ-8. జిమ్ చంద్రశేఖర్, ఏ-9. మావ్స్ మనీల పేర్లను పొందుపరిచారు.






