జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ రోజు(మంగళవారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారిపై కోటబొమ్మాళి-శ్రీకాకుళం మార్గంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశాకు చెందిన తండ్రి, కుమారై కారులో సింహాచలం వెళుతున్నారు. ఈ తరుణంలో ఎత్తురాళ్లపాడు వద్ద కారు ఆపారు. కాలకృత్యాలు కోసం కారు దిగారు. ఈ క్రమంలో ఓ వాహనం వారిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఆ ముగ్గురినీ శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతి చెందిన వారు తండ్రి సుశాంత్ కుమార్(52), కుమారై సంతోషి(3)తో పాటు గోకుల పండా(33)గా గుర్తించారు. తండ్రీ కుమారైలది గంజాం జిల్లా మైసంపూర్ గ్రామం, గోకుల పండా బ్రహ్మపురలోని గేట్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story