దేశంలోనే తొలిసారి.. రాష్ట్రంలో డ్రోన్, స్పేస్ సిటీలకు శంకుస్థాపన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మరో రెండు అభివృద్ధి కార్యక్రమాలు పురుడుపోసుకున్నాయి..

దేశంలోనే తొలిసారి.. రాష్ట్రంలో డ్రోన్, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో రెండు అభివృద్ధి కార్యక్రమాలు పురుడుపోసుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో డ్రోన్, స్పేస్ సిటీలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండింటికి శనివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు డ్రోన్, స్పేస్ సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్, స్పేస్ సిటీ నిర్మాణం చేయాలనుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం సాయం కోరారు. సానుకూలంగా స్పందించడమే కాకుండా డ్రోన్, స్పేస్ సిటీలకు ఏర్పాటుపై హామీ ఇచ్చింది. విశాఖ సీఐఐ సదస్సుకు హాజరైన గోయల్ శుక్రవారం డ్రోస్, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Next Story