- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో దారుణం.. పొలంలో ఇద్దరు కూలీలు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
ఇద్దరు కూలీలుదుర్మరణం చెందిన ప్రకాశం జిల్లాలో జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు కూలీలు(Laborers) దుర్మరణం చెందిన ప్రకాశం జిల్లా(Prakasam District)లో జరిగింది. కొనకమిట్ల మండలం పెద్దారవీడు(Peddaravidu) గ్రామానికి చెందిన నాగరాజు, రంగారావు దినసరి కూలీలు. రోజు మాదిరిగానే గురువారం గొట్లగట్టులో పనులకు వెళ్లారు. అయితే పొలంలో విద్యుత్ తీగలు(Electrical Wires) లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ తీగల్లో ఒక్కసారిగా కరెంట్ సరఫరా అయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి విద్యుత్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కరెంట్ నిలిపివేసి నాగరాజు, రంగారావు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పెద్దారవీడులో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు.
Next Story






