- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామర్లకోట సమీపంలో ఘోర ఆటో ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
మట్లపాలెం నుంచి సామర్లకోట వెళ్తున్న ఓ ఆటో ఘోర ప్రమాదానికి గురైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మట్లపాలెం నుంచి సామర్లకోట వెళ్తున్న ఓ ఆటో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విషాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఉప్పాడ గ్రామానికి చెందిన గంపల చిట్టెమ్మ, ఆటో డ్రైవర్ వెరిపల్లి ప్రేమ్ కుమార్‌గా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు చిట్టెమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆటో డ్రైవర్ ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు.
ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు మహిళలను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ఉప్పాడ, అమీనాబాద్ ప్రాంతాలకు చెందిన గరికిన సింహాద్రి, రామిశెట్టి నాగమణి, వెరిపల్లి చిట్టమ్మ, మేకల పోలీస్వారీ, దొడ్డి సత్యవతిలుగా గుర్తించారు. ప్రస్తుతం వీరందరికీ చికిత్స అందుతుండగా.. వీరిలో గరికిన సింహాద్రి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, భారీ ట్రక్కు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆటో ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






