‘చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దులు’.. పండగ పూట పవన్‌పై మంత్రి అంబటి సెటైర్లు

by Disha Web Desk 1 |
‘చంద్రబాబు పక్కన రెండు గంగిరెద్దులు’.. పండగ పూట పవన్‌పై మంత్రి అంబటి సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండగ మూడ్‌లో ఉంటే మంత్రి అంబటి మాత్రం ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఫోటోను తన X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోగి పర్వదినం సందర్భంగా ఆదివారం మందడంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగారు. అయితే అదే ఫొటోను టీడీపీ, జనసేన నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘బాబు పక్కన రెండు గంగిరెద్దులు’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో టీడీపీ, జనసేన అభిమానులు మంత్రిపై అంబటి తీవ్రంగా మండిపడుతున్నారు. స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాలంటూ చీవాట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed