- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెనాలిలో దారుణం.. ఇద్దరు వృద్ధురాళ్ళ దారుణ హత్య
గుంటూరు(Gunturu) జిల్లా తెనాలి(Tenali)లో దరఉన ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు(Gunturu) జిల్లా తెనాలి(Tenali)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళు నేడు దారుణ హత్య(Elderly Women Murdered)కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే ఇద్దరు వృద్ధ మహిళలు గురువారం ఉదయం బంధువుల వివాహానికి హాజరయ్యి ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం పెళ్లి నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని, ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
అయితే వీరు శుభకార్యానికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వృద్ధుల ఒంటిమీద బంగారం లేకపోవడం, ఘటనా స్థలంలో పెనగులాట జరిగిన ఆనవాళ్ళు ఉండటం, వారి తలపై బలమైన గాయాలు ఉండటంతో.. బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని, కుటుంబ సభ్యులను, అనుమానితులను విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.






