- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీ శాంతికి షాక్.. తిరిగి జైలుకే...!
by Vemula.Srinu Prasad |
దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి రెండ్రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీలో భాగంగా పోలీసులు ఆమెను అధికారులు క్షుణ్ణంగా విచారించారు...

X
దిశ, వెబ్ డెస్క్: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి(Endowments Department Assistant Commissioner K. Shanthi) రెండ్రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీలో భాగంగా పోలీసులు ఆమెను అధికారులు క్షుణ్ణంగా విచారించారు. కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం నిబంధనల ప్రకారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పోలీసుల భారీ భద్రత నడుమ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో శాంతి రిమాండ్‌ను పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు ఆమెను తిరిగి జిల్లా జైలుకు తరలించారు. కాగా పలు ఆరోపణలు నేపథ్యంలో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఈ కేసులో ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ రోజు విచారణ ముగియడంతో జైలుకు తరలించారు.
Next Story






