విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు రెండ్రోజుల పాటు సెలవులు

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు రెండ్రోజుల పాటు సెలవులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదటగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే రోడ్‌ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి మోడీ పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ - శ్రీశైలం, దోర్నాల - శ్రీశైలం మార్గాల్లో గురువారం మధ్యాహ్నం ఆంక్షలు విధించారు. దాంతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధవారం, గురువారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Next Story