ఇంట్లో డబ్బులు తీసుకొని బస్ ఎక్కిన విద్యార్థులు.. కట్ చేస్తే ముంబైలో గుర్తింపు

by Vemula.Srinu Prasad |

విజయవాడ భవానీపురంలో గురువారం ఇద్దరు పిల్లల మిస్సింగ్ అయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విద్యార్థులను ముంబైలో గుర్తించారు...

ఇంట్లో డబ్బులు తీసుకొని బస్ ఎక్కిన విద్యార్థులు.. కట్ చేస్తే ముంబైలో గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ భవానీపురంలో గురువారం ఇద్దరు పిల్లల మిస్సింగ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మేరారామ్‌ (12), ఉమారామ్‌ (13) ఇంట్లో క్యాష్‌ తీసుకొని ట్యూషన్‌కి వెళ్లకుండా పిల్లలు ఆటోలో బస్టాండ్‌కు వెళ్లారు. స్థానిక సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లారు. అక్కడి నుంచి గుజరాత్‌ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గుజరాత్ నుంచి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో పిల్లలు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story