- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: క్వారీ గుంతలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తు క్వారీ గుంత(Quarry Pit )లో మునిగి ఇద్దరు చిన్నారులు(Two children) మృతి(Died) చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా(Anantapur District) శెట్టూరు మండలం యాటకల్లు(Yatakallu)లో జరిగింది. వేసవి సెలవులు కావడంతో యాటకల్లులోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. సరదా క్వారీ గుంత వద్దకు వెళ్లారు. ప్రమాదశాత్త క్వారీ గుంతలో పడ్డారు. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయి మృతి చెందారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చిన్నారులు చనిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు క్వారీ గుంతను పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు ఆందోళనలకు దిగారు. అక్రమంగా క్వారీ గుంత తవ్వి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ గుంత తీసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






