ఆత్మహత్య ఘటనలో లభ్యమైన రెండు మృతదేహాలు

by Thanuru Gopichand |

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని మంచాలకట్ట ఎస్ఆర్బీసీలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఆత్మహత్య ఘటనలో లభ్యమైన రెండు మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని మంచాలకట్ట ఎస్ఆర్బీసీలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఎల్లా లక్ష్మి (23), వైష్ణవి (3) గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్ బృందం వెలికి తీసింది. డిసెంబర్ 28న కుటుంబ కలహాలతో పిల్లలను కాల్వలో తోసి తాను కూడా దూకి ఎల్లా లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఆర్బీసీలో మూడు రోజుల పాటు వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగింది. మరో చిన్నారి సంగీత కోసం బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం డిసెంబరు 28న వండుట్ల గ్రామానికి చెందిన ఎల్లా లక్ష్మి తన మూడు నెలల చిన్నారి సంగీతను, మూడేళ్ల చిన్నారి వైష్ణవితో ఆదివారం సాయంత్రం ఎస్‌ఆర్‌బీసీలో దూకింది. దీంతో గడివేముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి వరకు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం కూడా గాలింపును కొనసాగించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది, నాటుపడవలు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. డ్రోన్ సహాయంతో కాలువ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. మంగళవారం ఉదయం చేపట్టిన గాలింపు చర్యల్లో లక్ష్మితో పాటు కుమార్తె వైష్ణవి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో చిన్నారి సంగీత మృతదేహం కోసం గాలింపును కొనసాగిస్తున్నారు.

Next Story