- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం: రోడ్డుపక్కన అమ్మాయి.. రైల్వే ట్రాక్‌పై అబ్బాయి మృతదేహాలు
సామర్లకోటలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట(Samarlakota)లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన అమ్మాయి, రైల్వే ట్రాక్‌పై అబ్బాయి మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అమ్మాయిని చంపి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు గుర్తించారు. ప్రేమనా.. ఇవ్‌టీజింగ్ వ్యవహారమా అనే విషయం తెలిసిందే. గత రాత్రి 12.30 తర్వాత ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసుల తెలిపారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలో ఉందని, పూర్తి స్థాయి వివరాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. మృతులిద్దరూ గొల్లప్రోలు మండలానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వారి ఫోన్ కాల్ డేటా ఆధారంగా అమ్మాయి తొమ్మిదో తరగతి చదివే సమయంలో అబ్బాయి ఆమె వెంట పడినట్లు తేలిందన్నారు. అమ్మాయి హత్యకు ముందు ఇద్దరు ఫోన్లలో నెంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. అమ్మాయి మృతదేహం వద్ద అబ్బాయి క్యాప్ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.






