- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. మృతుల్లో ఇద్దరు ఏపీ వాసులు
ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇవాళ(గురువారం) ఉదయం పర్యాటకులతో వెళుతున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ క్రాషై ప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు ఏపీ(Andhra Pradesh) వాసులు ఉన్నట్లు సమాచారం. ఏపీకి చెందిన అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వేదవతి కుమారి భర్త భాస్కర్‌కు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయనను వెంటనే రిషికేశ్ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, విజయ రెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే.. పర్యాటకులతో గంగోత్రి సైట్ సీయింగ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ గంగ్నాని అటవీ ప్రాంతంలోకి రాగానే అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.






