Breaking: కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 07:56:50  IST  )

కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు వెళ్లారు....

Breaking: కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర సర్వీసుల్లోకి ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌(AP cadre IAS)లు వెళ్లారు. జనగణన డైరెక్టర్‌గా 2010 బ్యాచ్ అధికారి జె.శ్రీనివాస్(J. Srinivas), కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ డైరెక్టర్‌గా 2011 బ్యాచ్ అధికారి ఎం. హరి నారాయణన్‌(M. Hari Narayanan)ను రాష్ట్రం నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వీరిద్దరూ త్వరలో కేంద్ర సర్వీసుల బాధ్యతలను తీసుకోనున్నారు.

కాగా ఎప్పటి నుంచో వీరిద్దరూ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎం. హరి నారాయణన్‌ గతంలో వైసీపీకి అనుకూలంగా పని చేశారనే ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు సరైన ప్రాధాన్యత లేదని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమను సర్వీసుల్లోకి తీసుకోవాలని కేంద్రానికి ఆయన దరఖాస్తు కూడా చేశారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఐఏఎస్ జె.శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరగా పని చేశారని ప్రచారం జరిగింది. అయితే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ఆయన కూడా దరఖాస్తు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఐఏఎస్‌లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు.

Next Story