Breaking: రెండు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 13:34:00  IST  )

విశాఖ వెళ్లే రెండు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు...

Breaking: రెండు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను తీవ్రత రాష్ట్రంపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ(Air India airline) అప్రమత్తమైంది. విశాఖ వెళ్లే రెండు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశారు. విజయవాడ-విశాఖ, బెంళగూరు- విశాఖ విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈదురు గాలులు వీస్తుండటంతో విమాన ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు సర్వీసులను రద్ద చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. దీంతో ప్రయాణికుల్లో నిరాశ ఏర్పడింది.

Next Story