తుని అత్యాచారం కేసులో ట్విస్ట్.. నిందితుడు నారాయణ‌రావు ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 05:25:26  IST  )

కాకినాడ జిల్లా తుని (Tuni)లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తుని అత్యాచారం కేసులో ట్విస్ట్.. నిందితుడు నారాయణ‌రావు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా తుని (Tuni)లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు తాటిక నారాయణరావు (62) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కోర్టుకు తరలిస్తున్న సమయంలో నిందితుడు బహిర్భూమికి వెళ్తానని చెప్పి.. తుని పట్టణ శివారులోని కోమటి‌చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అనంతరం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టగా కాసేపటి క్రితం నారాయణ‌రావు మృతదేహం లభ్యమైంది.

Read More: కోమటి చెరువు దగ్గర ఉద్రిక్తత.. పోలీసులను అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ

Next Story