ఎమ్మెల్యే అవర శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్.. మరో ఇద్దరు మహిళలతోనూ పులిహోర

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-06 10:55:24  IST  )

రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు చేసిన వీణ వ‌రుస‌గా వీడియోలు, చాటింగ్ హిస్ట‌రీని బ‌య‌ట‌పెడుతోంది. ఇప్ప‌టికే వారి వీడియో కాల్స్ కి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ లు, ఎమ్మెల్యేను క‌లిసిన స‌మ‌యంలో తీసుకున్న వీడియోల‌ను

ఎమ్మెల్యే అవర శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్.. మరో ఇద్దరు మహిళలతోనూ పులిహోర
X

దిశ‌, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు చేసిన వీణ వ‌రుస‌గా వీడియోలు, చాటింగ్ హిస్ట‌రీని బ‌య‌ట‌పెడుతోంది. ఇప్ప‌టికే వారి వీడియో కాల్స్ కి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ లు, ఎమ్మెల్యేను క‌లిసిన స‌మ‌యంలో తీసుకున్న వీడియోల‌ను బ‌య‌ట‌పెట్టిన వీణ ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో ఎమ్మెల్యే చేసిన‌ చాటింగ్ హిస్ట‌రీని బ‌య‌పెట్టింది. అయితే చాటింగ్ చూస్తే సిరి అనే వివాహిత‌తో చేసిన చాటింగ్ లో శ్రీధ‌ర్.. మ‌న‌మిద్ద‌రం ప‌ర్స‌న‌ల్ క‌లుద్దాం అంటూ అడిగిన‌ట్టు ఉంది. అంతే కాకుండా గ‌తంలో వీరిద్దరికీ ప‌రిచ‌యం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. శ్రీధ‌ర్ తో అవ‌త‌ల మ‌హిళ సైతం క్లోజ్ గానే ఉన్న‌ట్టు చాటింగ్ క‌నిపిస్తోంది. ఆ మ‌హిళ‌ 10వ తేదీన వ‌స్తావా నేను అమ‌రావ‌తికి వెళుతున్నా.. అంటూ ఆమె చాటింగ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో రేపు వ‌స్తావా అని ఎమ్మెల్యే రిప్లై ఇవ్వ‌గా హా వ‌స్తాను అంటూ స‌మాధానం ఇచ్చింది.

మీరు ఎమ్మెల్యే క‌దా న‌న్ను క‌లుస్తారా అని అడ్డ‌గా ఎమ్మెల్యే.. మీ ఇష్టం అంటూ స‌మాధానం ఇచ్చాడు. దీంతో అదేంటి నీ ఇష్టం అని అంటున్నావ్.. ర‌మ్మ‌ని చెప్పొచ్చుగా అని మెసేజ్ చేయ‌గా నేను ఎలా చెప్తా అంటూ ఎమ్మెల్యే రిప్లై ఇచ్చారు. చంద్ర‌బాబుతో మీటింగ్ ఉన్న విష‌యాన్ని కూడా శ్రీధ‌ర్ మ‌హిళ‌కు చెప్పిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బెంగళూరుకు చెందిన మ‌రో మ‌హిళ‌తోనూ శ్రీధ‌ర్ చాటింగ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ముందుగా ఆ యువ‌తే ఎమ్మెల్యేకు మెసేజ్ చేసిన‌ట్టు క‌నిపిస్తుండ‌గా త‌ర‌వాత ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన త్రిస‌భ్య క‌మిటీ వేయ‌గా శ్రీధ‌ర్ ను విచారించింది. ఆ నివేధిక‌ను సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అందించిన‌ట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే ట్రాప్ చేశాడా? ట్రాప్ లో పడ్డాడా?

ఇదిలా ఉంటే శ్రీధ‌ర్, మ‌హిళ‌ల మ‌ధ్య చాటింగ్ హిస్ట‌రీ చూస్తే ట్రాప్ చేశాడా లేదా వాళ్ల ట్రాప్ లోనే ప‌డ్డాడా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. దానికి కార‌ణం శ్రీధ‌ర్ ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర‌వాత అవ‌త‌ల‌వాళ్ల నుండే సందేశాలు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. అయితే వారికి రిప్లై ఇచ్చిన శ్రీధ‌ర్ పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌నిపిస్తుంది. అంతే కాకుండా వీణ‌తో చేసిన చాటింగ్ లో శ్రీధ‌ర్ ప్ర‌శాంతంగా ఉన్న‌ప్ప‌టికీ ఆమె బూతులు మాట్లాడిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ క్వాష్ పిటిషన్.. హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు

Next Story