ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ క్వాష్ పిటిషన్.. హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 10:56:19  IST  )

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ క్వాష్ పిటిషన్.. హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ (Arava Sridhar)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి (Venkata Jyothirmayi) విచారించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, తక్షణమే ఈ కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చి ఈ వ్యవహారంపై ఆయన వివరణను తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. బీఎన్ఎష్ యాక్ట్‌లోని సెక్షన్ 35(3) నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. అరెస్టు చేయాల్సిన ఆవరసం ఉంటే తప్పనిసరిగా తగిన వ్రాతపూర్వక కారణాలను నమోదు చేయాలని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యేకు మధ్యంతర ఊరటనిచ్చింది.

కాగా, మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఎమ్మెల్యే మొదటి నుంచి వాదిస్తున్నారు. పార్టీ పరంగా కూడా జనసేన అధిష్టానం ఈ విషయంపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే అవర శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్.. మరో ఇద్దరు మహిళలతోనూ పులిహోర

Next Story