- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
by Malleboina Mahesh |
అన్నదమ్ములను వేట కొడవళ్లతో అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపారు. ఈ షాకింగ్ ఘటన పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: అన్నదమ్ములను వేట కొడవళ్లతో అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపారు. ఈ షాకింగ్ ఘటన పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల లో చోటు చేసుకుంది. మృతులు టీడీపీ కార్యకర్తలు అయిన హనుమంతు, శ్రీరాంమూర్తిగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జంట హత్యలతో ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఉలిక్కిపడింద. దీంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా టీడీపీ నేతలు అయిన ఇద్దరు అన్నదమ్ములను ఎవరూ హతమార్చారనే సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
Next Story






