- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ పేలుళ్లు.. మృతి చెందింది వీరే..!
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్య ఫైర్ వర్క్స్‌లో జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapalem)లో సూర్య ఫైర్ వర్క్స్(Surya Fire Works)లో జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. టపాసులు ఒక్కసారిగా పేలడంతో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు పని చేస్తున్నారు. పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మందికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల్లో ఇప్పటివరకు 13 మందిని గుర్తించారు. అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నానితో పాటు మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
Next Story






