హైడ్రా తరహాలో ఏపీలో ‘ఆపరేషన్‌ స్వర్ణ’

by Vemula.Srinu Prasad |

పవిత్ర స్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జీవో తీసుకొచ్చామని తుడా ఛైర్మన్‌ దివాకర్‌ రెడ్డి తెలిపారు...

హైడ్రా తరహాలో ఏపీలో ‘ఆపరేషన్‌ స్వర్ణ’
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర స్వర్ణముఖి నది(Swarnamukhi River) పరిరక్షణకు కొత్త జీవో తీసుకొచ్చామని తుడా ఛైర్మన్‌ దివాకర్‌ రెడ్డి(Tuda Chairman Diwakar Reddy) తెలిపారు. స్వర్ణముఖి నది వెంబడి వైసీపీ(Ycp) హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయని చెప్పారు. స్వర్ణముఖి నదికి ఇరువైపులా భూములు కొట్టేశారని, వంకలు, చెరువులను తప్పుడు పత్రాలతో దోచుకున్నారన్నారు. నది బఫర్‌ జోన్‌ను పట్టించుకోకుండా కబ్జా చేశారని, ఏపీలో మొదటిసారి నది అభివృద్ధికి నడుం బిగించామని తెలిపారు. ‘ఆపరేషన్‌ స్వర్ణ’ పేరిట స్వర్ణముఖి నది ప్రక్షాళన చేపట్టనున్నామని, నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, కబ్జాలను తొలగిస్తామని పేర్కొన్నారు. హైడ్రా తరహాలో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్‌లను వినియోగించి సర్వే చేపడతామని తెలిపారు. నది బఫర్‌ జోన్‌లో స్థలాలు విక్రయించినవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని, నదిలో ఇల్లు కట్టడం వల్ల రెండేళ్ల క్రితం అపార నష్టం జరిగిందని దివాకర్‌ రెడ్డి తెలిపారు.


‘‘ఇదంతా గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపం.. తుడా, మున్సిపల్‌, ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలు తొలగిస్తాం. ఆక్రమణలు చేసిన వారు ఎంతటివారైనా వదిలేది లేదు.. తుడాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ పూర్తయింది. మద్యం స్కామ్‌లో తుడా వాహనాలు వినియోగించారు. తుడా నిధులు రూ.270 కోట్లు ఎంపీడీవో ఖాతాలకు మళ్లించి దోచుకున్నారు.’’ అని తుడా ఛైర్మన్‌ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Next Story