TTD: రూ.100 కోట్లు దాటిన టీటీడీ నెల ఆదాయం

by Thanuru Gopichand |

కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి నెల ఆదాయం వంద కోట్ల రూపాయలను దాటింది.

TTD: రూ.100 కోట్లు దాటిన టీటీడీ నెల ఆదాయం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి (titumala tirupathi devastanam) నెల ఆదాయం వంద కోట్ల రూపాయలను (100 crores) దాటింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో దేవస్థానం హుండీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదాయాన్ని బోర్డు వెల్లడించింది. ఈ నెలలో ఆదాయం రూ.100.69 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. టీటీడీ (ttd) ఆదాయం ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Next Story